![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 అప్పుడే నాలుగో వారానికి వచ్చేసింది. నాలుగో వారానికి సంబంధించినది నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతుంది. ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. సుమన్ శెట్టి, భరణి, తనూజ, పవన్ కళ్యాణ్.. నలుగురిని టీమ్ లీడర్స్ గా బిగ్ బాస్ సెలక్ట్ చేస్తాడు.
ఒక్కో టీమ్ కి ముగ్గురు సభ్యులు లు ఉంటారు. సుమన్, రాము, ఫ్లోరా ముగ్గురు ఎల్లో టీమ్.. తనూజ, రీతూ, దివ్య బ్లూ టీమ్.. హరీష్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ రెడ్ టీమ్, భరణి, సంజన శ్రీజ గ్రీన్ టీమ్ గా ఉన్నారు. సంఛాలక్ గా డీమాన్ పవన్ ఉన్నాడు. టాస్క్ లో గెలిచిన వారికి నామినేషన్ చేసే ఛాన్స్ వస్తుంది. బిగ్ బాస్ ఆదేశానుసరం బజర్ వస్తుంది. అప్పుడు డీమాన్ పవన్ డైస్ రోల్ చేస్తాడు. మొదటగా తనూజకి ఛాన్స్ వస్తుంది. తను సుమన్ శెట్టి టీమ్ ని టాస్క్ ఆడడానికి సెలక్ట్ చేసుకుంటుంది. కానీ ఆ టాస్క్ సుమన్ శెట్టి టీమ్ గెలిచి. తనూజ టీమ్ లోని రీతూని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత భరణికి ఛాన్స్ రాగా.. అతను కూడా ఎల్లో టీమ్ అయినా సుమన్ ని సెలక్ట్ చేసుకుంటాడు అందులో భరణి గెలుస్తాడు .ఆ టీమ్ ఎల్లో టీమ్ లోని ఫ్లోరాని నామినేట్ చేస్తారు.
ఆ తర్వాత మళ్ళీ భరణికి ఛాన్స్ రాగా.. సుమన్ శెట్టి టీమ్ ని సెలక్ట్ చేసుకుంటాడు. తర్వాత సుమన్ శెట్టి టీమ్ గెలవగా సంజనని నామినేషన్ చేస్తారు. ఆ తర్వాత తనూజ టీమ్ కి ఛాన్స్ రాగా గ్రీన్ టీమ్ లోని శ్రీజని నామినేషన్ చేస్తారు.ఆ తర్వాత సుమన్ శెట్టి టీమ్ ఎల్లో టీమ్ కి ఛాన్స్ వస్తుంది. దాంతో హరీష్ ని నామినేషన్ చేస్తారు. ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు ఎవరు నామినేషన్ లో ఉన్నారని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |